ఘనంగా విలక్షణ నాయకుడు జగదీశ్వర్ గౌడ్ జన్మదినం.. విస్తృతంగా సేవా కార్యక్రమాలు

నమస్తే శేరిలింగంపల్లి : నమ్మిన ప్రజలకు న్యాయం చేసే ప్రజానేత, విలక్షణమైన నాయకుడు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకను నల్లగండ్ల గ్రామంలోని తన నివాసం వద్ద అభిమానులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా చేపట్టారు. రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంపులు, విద్యార్థులకు నోటు పుస్తకాలు, అనాథఆశ్రయాల్లో పండ్ల పంపిణీ వంటి అనేక సేవాల కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టారు.

ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ కు కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ బండి రమేష్, కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ , కార్పొరేటర్ హమీద్ పటేల్, నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు, మాజీ కార్పొరేటర్లు అశోక్ గౌడ్, భాను ప్రసాద్, నియోజకవర్గ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ వీరాభిమానులు, మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్ యూ ఐ నాయకులు పాల్గొని జగదీశ్వర్ గౌడ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here