నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధి మార్తాండ్ నగర్ కి చెందిన కళావతి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు కోగా.. సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ నుంచి రూ. 2 లక్షలు మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ మంజూరి పత్రాన్ని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబానికి అందజేశారు.
ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. వైద్య చికిత్స కి సహకారం అందించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి బాధితుల కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావూరి అనిల్, సాంబయ్య, షేక్ జమీర్, అక్కరావు పాల్గొన్నారు.