నమస్తే శేరిలింగంపల్లి : బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధిగా అమర్ నాథ్ యాదవ్ నియమితులయ్యారు. తనపై నమ్మకముంచి, తన నియామకానికి సహకరించిన పార్టీ పెద్దలకు, ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని తెలిపారు. తాను ఈ పదవికి నియమితులైనందుకు హర్షం వ్యక్తం చేస్తూ.. పార్టీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.