శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ప్రజలకు శుభాలు, విజయాలు సిద్ధించాలి

  • శేరిలింగంపల్లి రైతు బజార్ విక్రయ కేంద్రంలో ఉగాది పచ్చడి పంపిణీ చేసిన పార్లమెంట్ సభ్యుడు డాక్టర్.జి.రంజిత్ రెడ్డి సతీమణి సీత రంజిత్ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్ చార్జి జగదీశ్వర్ గౌడ్, కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి రైతు బజార్ విక్రయ కేంద్రంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్.జి.రంజిత్ రెడ్డి సతీమణి సీత రంజిత్ రెడ్డి, వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ ప్రజలకు ఉగాది పచ్చడి పంపిణీ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు, విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలన్నారు.

శేరిలింగంపల్లి రైతు బజార్ విక్రయ కేంద్రంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్.జి.రంజిత్ రెడ్డి సతీమణి సీత రంజిత్ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్ చార్జి జగదీశ్వర్ గౌడ్, కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్

కొత్త సంవత్సరంలో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరికీ సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్.జి.రంజిత్ రెడ్డికి మీ అమూల్యమైన ఓటు వేసి అభివృద్ధికి కృషి చేయాలని ప్రజలను వి.జగదీశ్వర్ గౌడ్ కోరారు.

ఉగాది పచ్చడి అందిస్తూ…

ఈ కార్యక్రమంలో హాఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్, జి.హెచ్.ఎం.సి లేబర్ సెల్ చైర్మన్ నల్ల సంజీవ రెడ్డి, నాయకులు సునీత ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ యాదవ్, సత్యం గౌడ్, మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఖాజా పాషా, భారతి నగర్ డివిజన్ అధ్యక్షులు గిరి, మనోజ్, ప్రసాద్, అస్లాం, గోపాల్ నాయక్, అశోక్ గౌడ్, హనీఫ్, రాజేష్, నర్సింహ, శ్రీనివాస్, సురేందర్, శ్రీనివాస్ గౌడ్, జఫ్ఫార్, మాజీ కౌన్సిలర్ సునీత రెడ్డి, హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షురాలు రేణుక, బి.బ్లాక్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, మహిళలు పార్వతి, శాంత, లలిత రాణి, మల్లికా, తన్విర్, సంగీత, కవిత, సావిత్రి, వహీదా, నేహా ఖాన్, కనకలక్ష్మీ, విజయ, లత పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here