పార్కు స్థలాలను పరిరక్షించిన గౌతమీనగర్ వాసులకు అభినందనలు: కొల్లి మాధవి

గౌతమీనగర్ పార్కు స్థలాలను పరిశీలిస్తున్న కొల్లి మాధవి, కసిరెడ్డి భాస్కరరెడ్డి తదితరులు

చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): రెండు దశాబ్దాలుగా అలుపెరుగకుండా పోరాడి పార్కు స్థలాలను పరిరక్షించుకున్న చందానగర్ గౌతమీనగర్ వాసులకు బిజెపి రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి అభినందనలు తెలిపారు. బుధవారం గౌతమీ నగర్ పార్కు స్థలాలను ఆమె బిజెపి నేత కసిరెడ్డి భాస్కరరెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కొల్లిమాధవి మాట్లాడుతూ సుదీర్ఘ పోరాటంలో అన్ని అవరోధాలను అధిగమించి కబ్జాదారుడినుండి కాపాడుకోవడం గొప్ప విషయమని అన్నారు. పోరాటంలో భాగస్వాములైన కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, మహిళలు, కాలనీవాసులను ఆమె అభినందించారు. జీహెచ్ఎంసీ అధికారులు కామన్ ఎమనిటీస్, పార్కు స్థలాలను కాపాడడంలో నిక్కచ్చిగా, కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజల ఆస్తులను కాపాడే విషయంలో మరిన్ని కఠిన చట్టాలు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here