కొండా విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిద్దాం: గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : చేవెళ్ల పార్ల‌మెంట్ బిజెపి అభ్య‌ర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి మద్దతుగా శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రామ్ గూడలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా నిర్వహించిన బిజెపి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోదరీ అనితారెడ్డి, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పాల్గొని బిజెపికి ఓటు వేయాలని ప్రజలను కోరారు.

బిజెపి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోదరీ అనితారెడ్డి, పక్కన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి గెలిచిన రంజిత్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి చేసింది ఏమి లేదని, కనీసం ఒక్కరోజు ఈ ప్రాంతాల్లో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకోలేదన్నారు. అదే మన అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటూ ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, ప్రజా సంక్షేమం కోసం పనిచేసే కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటి వ్యక్తిని భారీ మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గంతోపాటు మన ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వసంత్ కుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ సీనియర్ నాయకులు మీన్ లాల్ సింగ్, స్వామి గౌడ్, రవీందర్ రెడ్డి, హనుమంత్ నాయక్, వరలక్ష్మి, ధన్ రాజ్ సింగ్, జితేందర్ సింగ్, శంకేశ్ సింగ్, అరవింద్ సింగ్, నర్సింగ్ నాయక్, నర్సింగ్ రావు, శేఖర్, విఠల్ గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షులు శివ సింగ్, సీనియర్ నాయకులు కిషన్ గౌలి, మహేష్ గౌలీ, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, గోపాల్, బాబ్లు సింగ్, రాజు, శ్రీను, యాదయ్య, గోవింద, ప్రసాద్, ఉమేష్, కార్యకర్తలు, నానక్ రామ్ గుడా కాలనీ వాసులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here