నమస్తే శేరిలింగంపల్లి : టీడీపీ శేరిలింగంపల్లి ఇన్ చార్జి కట్ట వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సామ భూపాల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బక్కిలి ఐలయ్య యాదవ్, ఐటీడీపీ అధ్యక్షులు హరికృష్ణ, కోటేశ్వరరావు హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో కంటి వ్యాధులు, బ్లడ్ ప్రెషర్, ఈసీజీ, షుగర్, పండ్ల సమస్యలపై పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి కంటి పరీక్షల అనంతరం కండ్లద్దాలు పంపిణీ చేశారు. దాదాపు 258 మంది పాల్గొని వైద్య సేవలు పొందారు.
వైద్య శిబిరానికి సహకరించిన వైద్య బృందానికి, శేర్లింగంపల్లి డివిజన్ అధ్యక్షులు ఏరువ సాంబశివ గౌడ్, సీనియర్ నాయకులు మధుమోహన్, నాయకులకు కార్యకర్తలకు కట్ట వెంకటేశ్ గౌడ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఐలేష్ యాదవ్, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ కృష్ణ, తెలుగు యువత జాయింట్ సెక్రటరీ కోటేశ్వరరావు, డివిజన్ అధ్యక్షులు కడియాల రాజేంద్ర బాబు, కిషోర్ కుమార్ యాదవ్, బాలాజీ, చిట్టిబాబు, రామారావు, రామకృష్ణ గౌడ్, శ్రావణ్, రంగారెడ్డి, మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.