ఇకపై కరోనాతో సహా 1500 రకాల రోగాలకు ఉచిత వైద్యం

తెలంగాణలో అమలు కానున్న ఆయుష్మాన్ భారత్ పథకం

నమస్తే శేరిలింగంపల్లి: దేశంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం తెలంగాణ రాష్ట్రంలో అమలు కానుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కొనసాగుతున్న ఆరోగ్యశ్రీ పథకానికి ఆయుష్మాన్ భారత్ స్కీం ను అనుసంధానించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ ఈ విషయాన్ని బుధవారం ప్రధానమంత్రి మోడీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో వివరించారు. ఈ పథకం అమలు జరిగితే అర్హులైన ప్రతీ కుటుంబానికి ఐదులక్షల చొప్పున ఆరోగ్య భీమా అందనుంది. ఈ పథకం క్రింద కరోనాతో పాటు దాదాపు 1500 వందల రకాల రోగాలకు ప్రభుత్వం ఉచితంగా వైద్యసేవలు అందించనుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here