మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని బాలాజీ హిల్స్ చంద్ర నాయక్ తండాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్క్‌మినేషన్ బ్యాడ్మింటన్, ఆర్చరీ, ఫుట్ బాల్, క్రికెట్ కోర్ట్ ల సముదాయంను కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాస రావుతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ఒకే ప్రాంగణంలో బ్యాడ్మింటన్, ఆర్చరీ, ఫుట్ బాల్, క్రికెట్ కోర్ట్ ల సముదాయం ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు. దీని వల్ల స్థానికులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. క్రీడలు శారీరక శ్రమతోపాటు మానసిక ఉల్లాసాన్ని కలగజేస్తాయన్నారు. కనుక ప్రతి ఒక్కరూ క్రీడలలో తరచూ పాల్గొనాలని అన్నారు. అలాగే స్థానిక క్రీడాకారులు కష్టపడి శిక్షణ పొంది అంతర్జాతీయ వేదికలపై ఆడుతూ శేరిలింగంపల్లికి పేరు ప్రఖ్యాతులు తేవాలన్నారు.
అనంతరం మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్, హైదరనగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్, మాదాపూర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ లతో కలిసి గాంధీ కాసేపు టెన్నిస్ ఆడి ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమంలో భిక్షపతి ముదిరాజ్, మధుసూదన్ రెడ్డి, సాంబయ్య, గోపాల్ నాయక్, ఖాజా, గంగల గణేష్ యాదవ్, సతీష్ యాదవ్, నర్సింహ, సార్వార్, సైబజ్, అరుణ్ యాదవ్, సాయి బాబు యాదవ్, రామాంజనేయులు, అజీమ్, షేక్, యుగేందర్, రాందస్, ఉన్నూర్, అంతర్జాతీయ ఆర్చర్ అరుణ్ కుమార్, నిర్వాహకుడు సంతోష్ పాల్గొన్నారు.