నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధి అరబిందో కాలనీలోని పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై జీహెచ్ఎంసీ అధికారులు, వాటర్ వర్క్స్ అధికారులు కాలనీవాసులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ పాదయాత్ర చేపట్టారు.
ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ అరబిందో కాలనీలో నెలకొన్న పలు సమస్యలను పరిశీలించామని, మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, కాలనీలలో తలెత్తిన డ్రైనేజీ సమస్యను తక్షణమే పరిష్కరించాలని, అధికారులకు ఆదేశించారు. నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్డు అభివృద్ధి పనులను త్వరగా చేపట్టాలని, నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్ స్పెక్టర్లు అన్వర్, లింగయ్య, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సూపర్ వైజర్ శ్రీనివాస్, కాలనీవాసులు నారాయణరెడ్డి, లోకేష్, చంద్రభాను, నర్సిరెడ్డి పాల్గొన్నారు.