- కూలిన పక్కన అపార్ట్ మెంట్ కంపౌండ్ వాల్
నమస్తే శేరిలింగంపల్లి : అ జాగ్రత్తగా అపార్ట్ మెంట్ సెల్లర్ల తవ్వకాల వల్ల ఊహించని నష్టం వాటిల్లుతున్నది. స్థానికులు ఇబ్బందులు పడాల్సిన పరిస్తితి నెలకొంది.
తాజాగా నిన్న నలగాండ్ల వర్టెక్స్ అపార్ట్మెంట్ సెల్లార్ తవ్వకాలు చేపట్టారు. ఐతే పక్కనే ఉన్న అపార్ట్మెంట్ కాంపౌండ్ గోడ కూలి ఆ అపార్ట్ మెంట్ కు నష్టం వాటిల్లింది. ఈ విషయమై అపార్ట్మెంట్ వాసులను టీపీసీసీ జనరల్ సెక్రటరీ జెరిపెటి జైపాల్ పరామర్శించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పోచయ్య, రాజేంద్ర, సూర్య రాథోడ్, రాములు సాయి కొండ, పాల్గొన్నారు.