అన్నమయ్యపురంలో అలరించిన “నృత్యోపచార” భరతనాట్య ప్రదర్శన

నమస్తే శేరిలింగంపల్లి : అన్నమయ్యపురంలో “అన్నమ స్వరార్చన” కార్యక్రమాలు అలరిస్తున్నాయి. “అన్నమ స్వరర్చాన” లో “నృత్యోపచార” నృత్య శిక్షణాలయ విద్యార్థులు’ “తొదయమంగళం”, ” వేంకటాచల నిలయం”, ” విషమకర”, “బ్రహ్మమొక్కటే”, “మధుర మధుర”, ” కదన కుతూలం” తదితర కీర్తనలకు శ్రేయ కల్లూరి, అనన్య కృష్ణకుమార్, నందిని, సుభి, నిషిక పుల్లూరు, రిషిక శ్రీధర్, స్వాతి కార్తీక విఘ్నేష్ , అదితి కార్తీక విఘ్నేష్ తదితరులు నృత్యప్రదర్శనలతో అలరించారు.

నాట్య ప్రదర్శనలో “నృత్యోపచార” కళాకారుల బృందం

పద్మశ్రీ డా. శోభారాజు నేతృత్వంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. కార్యక్రమానంతరం శోభారాజు కళాకారులను సత్కరించారు. కార్యక్రమానంతరం మంగళ హారతి, అందరికీ తీర్థ, ప్రసాదాలను అందజేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here