నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఇందులో భాగంగా బెంగళూరు నుండి విచ్చేసిన ప్రముఖ భరతనాట్య కళాకారిణి గుణశ్రీ నర్తన గణపతిమ్, రారవెను, శృంగారలహరి, మరకతమణిమయ అంశాలను ప్రదర్శించి మెప్పించారు. హైదరాబాద్ కి నుంచి వచ్చిన సుభాషిణి గిరిధర్ తన శిష్యబృందం చే భరతనాట్య ప్రదర్శనలో గణేశా, కార్తికేయ, నటేశ కౌతం, కాళీ కౌత్వం, నగుమోము, కాలై థూకి , తిల్లాన అంశాలను సుభాషిణి గిరిధర్, సుధీతి, అనన్య, మాన్విత, అన్విక, మీరా, వైభవి లు ప్రదర్శించి మెప్పించారు.