అన్నమయ్యపురంలో అలరించిన ఐశ్వర్య భారతి సంకీర్తనార్చన

నమస్తే శేరిలింగంపల్లి : పద్మశ్రీ డా.శోభారాజు ఆధ్వర్యంలో అన్నమయ్యపురంలో “అన్నమ స్వరార్చన” అలరించింది. వర్ధమాన కళాకారులు సంగీత, నృత్య ప్రదర్శలతో అందరినీ అలరింపజేసింది. శనివారం ఐశ్వర్య భారతి “మత్స్య కూర్మ వరాహ”, ” తిరుమలగిరిరాయ”, ” వాడివో కంటిరటరే”, “తందనాన”, ” సతులార చూడరే శ్రావణ బహుళాష్టమి”, ” చక్కని తల్లికి” , ” పెరిగినాడు చూడరో”, ” కలిగెనిదే నాకు”, “వేడుకొందామా”, “ఎంత చక్కనిదానవమ్మ” వంటి చక్కని అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించారు.

వీరికి వయొలిన్ విక్రమ్ తిరుపతి, మృదంగం పి.విద్యాసాగర్ వాద్యసహకారాన్ని అందించారు. పద్మశ్రీ డా. శోభారాజు నేతృత్వంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ గానవిభావరి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. కార్యక్రమానంతరం శోభారాజు కళాకారులను సత్కరించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here