- ఐటీ శాఖ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుని కలిసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై రంగారెడ్డి జిల్లా ఇంచార్జి, ఐటీ శాఖ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుని ఆయన నివాసంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘునాథ్ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని, చేపట్టవలసిన పలు అభివృద్ది పనులకై నిధులు మంజూరు చేయాలని కోరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించాలని, ముంపు ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని ప్రథమ ప్రాధాన్యతగా పనులను చేపట్టాలని, అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా నిధులు ఎక్కువ మొత్తంలో మంజూరు చేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు.
చెరువుల అభివృద్ది, పార్కుల అభివృద్ధి, డ్రైనేజి, సీసీ రోడ్ల వంటి మౌలిక వసతుల కల్పన కై దృష్టి పెట్టాలని, అధిక మొత్తంలో నిధులు మంజూరు చేసి అభివృద్ధికి సహకరించాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన చెరువుల సుందరీకరణ పనులు వేగవంతం చేసేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, పనులలో వేగం పెంచేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, నిధులు మంజూరు చేస్తానని, త్వరలోనే అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తామని, ప్రతి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు.