- శాలువా కప్పి గజమాలతో సత్కరించిన పార్టీ శ్రేణులు, అభిమానులు
- వెల్లువెత్తిన శుభాకాంక్షలు
- వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్, బిసి ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. దారిపొడవునా బ్యాండ్ మేళా తాళాలు, పటాకుల ఆనందహేళ నడుమ పార్టీ శ్రేణులు, అభిమానుల నడుమ ఆనందోత్సాహాల మధ్య తన జన్మదినం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్, బిసి ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న హాజరై జగదీశ్వర్ గౌడ్ కి శాలువా కప్పి పూలబోకెతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఇన్నాళ్లు కార్పొరేటర్ గా ప్రజాసేవ చేస్తూ సమాజంలో ప్రతి ఒక్కరికి తలలో నాలుకగా ఉన్న జగదీష్ అన్నని నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా వర్ధిల్లాలని, ప్రజాసేవలో మంచి పేరు తెచ్చుకొని ఎమ్మెల్యేగా తమ ముందుకు వచ్చి ప్రజా సేవ చేయాలని మరోకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జగదీశ్వర్ గౌడ్ తండ్రి హరీశ్వర్ అన్న చిన్నాన్న మల్లికార్జున్ పూర్తి కుటుంబం ప్రజాసేవ చేయడంలో ముందున్నారని, జగదీశ్వర్ గౌడ్ కూడా తెలంగాణ రాష్ట్రానికి సేవ చేయాలని, ఆశక్తిని భగవంతుడు ఇవ్వాలని హృదయపూర్వకంగా కోరారు.
శేరిలింగంపల్లి జైబీసీ అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ యాదవ్, ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్, మధుయాదవ్, తిరుపతి, సురేందర్, సత్తిరెడ్డి, శేరిలింగంపల్లి జైబీసీ ఐక్యవేదిక ఉపాధ్యక్షులు సత్యనారాయణ యాదవ్, అభిమానులు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సన్మానం చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్, శేరిలింగంపల్లి యువజన సంఘాలు జగదీశ్వర్ గౌడ్ ను గజమాలతో సత్కరించి శాలువా కప్పి పూల బొకేలు అందజేస్తూ జగదీశ్వర్ గౌడ్ నాయకత్వం వర్ధిల్లాలి జై జగదీష్ న్న నినాదాలు చేశారు.