నమస్తే శేరిలింగంపల్లి : సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజీవ్ గృహకల్ప (సాయిబాబా గుడి దగ్గర) దీప్తిశ్రీ నగర్ లలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు కొమిరిశెట్టి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేసిన తరువాత కొమిరిశెట్టి ఫౌండేషన్ ఛైర్మన్ కొమిరిశెట్టి సాయిబాబా, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా తాటిచర్ల వరలక్ష్మి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జిల్ మల్లేష్, స్థానిక మహిళా నాయకురాళ్లు అనసూయ దేవి, కృష్ణకుమారి, భూదేవి, విజయలక్ష్మి, అనూష పాల్గొన్నారు.






