మాస్టర్ అథ్లెట్ రాష్ట్ర పోటీల్లో రంగారెడ్డి అథ్లెట్ల హావా..

  • అభినందనలు తెలిపిన అధ్యక్షుడు కొండ విజయ్

నమస్తే శేరిలింగంపల్లి : రాష్ర్ట స్థాయిలో నిర్వహించిన మాస్టర్ అథ్లెటిక్ పోటీల్లో రంగారెడ్డి జట్టు సత్తాచాటింది. గచ్చిబౌలిలో 30, 31 తేదీల్లో నిర్వహించిన ఈ పోటీల్లో పాల్గొని 111 పథకాలు సాధించి ద్వితీయ స్థానంలో నిలించింది. ఈ సందర్భంగా క్రీడాకారులకు రాష్ట్ర అధ్యక్షుడు కొండ విజయ్ అభినందనలు తెలిపారు. పోటీల్లో రంగారెడ్డి నుండి 33 మహిళలు, 47 మంది పురుషులు వివిధ పోటీల్లో పాల్గొనగా.. 43 బంగారు, 33 రజిత, 35 కాంస్య పథకాలు సాధించారు.

ట్రోఫీలతో సత్తాచాటిన రంగారెడ్డి జట్టు

పథకాలు సాధించిన వారిలో పిజెఆర్ స్టేడియంలో శిక్షణ పొందే వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వారిలో ఏసురత్నం, మానస పతి, నాగలక్ష్మీలకు కొండ విజయ్, ప్రధాన కార్యదర్శి నూనె సురేందర్లు ప్రత్యేక అభినందనలు తెలిపారు. వచ్చేనెల ఫిబ్రవరి 9, 10, 11 తేదిల్లో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించే జాతీయ స్థాయి మాస్టర్ అథ్లెటిక్ పోటీలకు జనవరి చివరి వారంలో క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం ఉంటుందని కొండ విజయ్ తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here