వరద బాధితులకు అండగా ఉంటాం: బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్

  • గురు గోవింద్ సింగ్ కాలనీలో  పర్యటన.. 

నమస్తే శేరిలింగంపల్లి: గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. పొంగుతున్న డ్డ్రైనేజీ … రోజుల తరబడి నిలిచిన నీటితో బస్తీ వాసులు ఇక్కట్లు తప్పట్లేవు.. ఈ నేపథ్యంలో.. పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని పరిష్కరించేందుకు అల్విన్ కాలనీ డివిజన్ గురు గోవింద్ సింగ్ కాలనీ, జై శంకర్ కాలనీ ప్రాంతాలలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ పర్యటించారు. వరద బాధితులను ఓదార్చారు.

కాలనీలో పొంగి పొర్లుతున్న డ్రైనేజీ, ఇళ్లల్లోకి చేరిన వరదతో నిత్యావసర సరుకులు, కట్టుబట్టలు తడిసిపోయి ఇబ్బందులు పదుతున్నారని, వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. జిహెచ్ఎంసి అధికారులతో అక్కడనుండే ఫోన్ లో మాట్లాడుతూ తక్షణమే చర్యలు తీసుకోవాలని, అంటువ్యాధులు ప్రభలకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కాలనీవాసులు గురు ముక్ సింగ్, కమల్ సింగ్, భగవాన్ సింగ్, చారి అనంతమ్మ, బాలామణి, సలీం బాయ్, తెప్ప బాలరాజు ముదిరాజ్, సత్యారెడ్డి, రవీందర్ రావు, అంజద్ అమ్ము, మున్ ఆఫ్ ఖాన్, కాకర్ల అరుణ, పద్మ మోహిని, ఉమేష్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here