రోడ్డుపై రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం

  • మియాపూర్ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
  • 30 వాహనాలు సీజ్.. ఎఫ్ఐఆర్ నమోదు

నమస్తే శేరిలింగంపల్లి : మెట్రో యూ-టర్న్, మియాపూర్ రోడ్ వద్ద మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మియాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్, ఎస్ఐపీ మల్లేష్, ఎస్ఐపీ సుభాష్ పీఎస్ సిబ్బందితో కలిసి రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్న ద్విచక్ర వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ లో 26 మంది ద్విచక్రవాహనాలను తనిఖీ చేశారు.

రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసిన ద్విచక్రవాహనాలను తనిఖీ చేస్తున్న దృశ్యం

వాహనాలు, 4 ఆటోలు మొత్తం 30 వాహనాలను సీజ్ చేసి మియాపూర్ లా అండ్ ఆర్డర్ పీఎస్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రోడ్డుపై రాంగ్ సైడ్ లో వాహనాలు నడిపి ప్రజలకు హాని కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here