- అభినందనలు తెలిపి ఆశీర్వదించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట శ్రీ చైతన్య విద్యార్థులు 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ఉత్తీర్ణత సాధించారు. వీరిని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, కూకట్పల్లి కళాశాల ఏజీఎం రవి కుమార్, కూకట్పల్లి జోన్ ఏజీఎం శివరామకృష్ణ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అభినందించి, ఆశీర్వదించి, ఆంగ్ల నిఘంటువులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. 100 శాతం ఉత్తీర్ణత సాధించడం గొప్ప విషయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రతి ఒక్కరు ఒక లక్ష్యం ఏర్పరచుకొని ఆ దిశగా అడుగులు వేయాలన్నారు. క్రమశిక్షణ, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమి లేదని పేర్కొన్నారు. తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని అభిలాషించారు.
పదవ తరగతి పరీక్షా ఫలితాలలో 24 మంది 10 జీపీఏ, 37 మంది 9.7 జీపీఏ, 51 మంది 9.5 జీపీఏ, 58 మంది 9.0 జీపీఏ, 77 మంది 100 శాతంతో ఉత్తీర్ణతను సాధించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఆర్ ఐ శ్రీనివాస్ రెడ్డి, పద్మజ, కోఆర్డినేటర్ మురళీకృష్ణ, ప్రిన్సిపాల్ సింధూష , అకాడమిక్ డీన్ సునీల్, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.