చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): వేమన వీకర్ సెక్షన్ లో నెలకొన్న సమస్యలను దశలవారిగా పరిష్కరించి కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని వేమన వీకర్ సెక్షన్ కాలనీలో సోమవారం రఘునాథ్ రెడ్డి పర్యటించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను బస్తీ వాసులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కాలనీలో ఉన్న బస్తీ దవాఖానాను ఆయన సందర్శించారు. బస్తీ వాసులు రఘునాథ్ రెడ్డికి పుష్ప గుచ్ఛం అందజేసి సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీలో నెలకొన్న ఓపెన్ డ్రైనేజి సమస్యను పరిష్కరించడానికి తప్పకుండా కృషి చేస్తానని అన్నారు. కాలనీ వాసులు అందరూ కలిసి మెలసి ఉంటేనే కాలనీ అభివృద్ధి చెందుతుందని సూచించారు. బస్తీ ప్రజలకు ఎల్లప్పుడూ వైద్యం అందుబాటులో ఉంచడానికే బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఎదురైతే వెంటనే బస్తీ దవాఖానాకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సు సంధ్య, హారిక, కాలనీ వాసులు మల్లేశం, చెన్నయ్య, బాలయ్య, రమేష్, జహీర్, రాము, మోహన్, వెంకటేశం పాల్గొన్నారు.