శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో అనేక చోట్ల ఘనంగా ప్రి క్రిస్మస్ వేడుకలు జరిగాయి. తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు ఆ వేడుకల్లో పాల్గొన్నారు. పలు చోట్ల ప్రజా ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్లకు అందజేసిన దుస్తులను పంపిణీ చేశారు.
చందానగర్‌లో…
చందానగర్ డివిజన్ పరిధిలోని భవానీపురం వీకర్ సెక్షన్ యేసు ప్రార్థనా మందిరం చర్చిలో కాలనీ వాసులు ఏర్పాటు చేసిన ప్రి క్రిస్మస్ వేడుకలకు డివిజన్ తెరాస అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రఘునాథ్ రెడ్డి ఈ సందర్బంగా క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్స్ ఏలీయా, తిరుపాల్, శ్రీకాంత్, కృపాకర్, మల్లేశం, అనిల్ పాల్గొన్నారు.
మియాపూర్‌లో…
మియాపూర్ డివిజన్ పరిదిలోని బీకే ఎన్‌క్లేవ్‌లో ఉన్న రాక్ చర్చిలో ప్రి క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం క్రిస్టియన్లకు అందజేసిన దుస్తులను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌లు పేద క్రిస్టియన్లకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ తెరాస అధ్యక్షుడు గౌతమ్ గౌడ్, తెరాస నాయకులు గంగాధర్, అన్వర్ షరీఫ్, ప్రతాప్ రెడ్డి, మాధవరం గోపాల్, శ్రీనివాస్ గోపరాజు, వెంకటేశ్వర్లు, పూర్ణచందర్, స్వామి నాయక్, కృష్ణ నాయక్, రాజు, విజయ్, వరలక్ష్మి, సుప్రజ, పాస్టర్లు స్వామి, అబ్రహం పాల్గొన్నారు.
మాదాపూర్‌లో…
మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ లో ఉన్న టెండ్రిల్ మై స్కూల్ మానసిక వికలాంగుల పాఠశాలలో అవని ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెమి క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అవని ఫౌండేషన్ ఛైర్మెన్ సత్తుర్ శిరీష, మాదాపూర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు సాంబశివరావు, గుమ్మడి శ్రీనివాస్, పితాని శ్రీనివాస్, అప్పారావు, సాంబయ్య, వెంకట్రావు, ప్రిన్సిపాల్ పలిన పాల్గొన్నారు.
ఎంఏ నగర్లో…
మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎంఏ నగర్ కాలనీలో ఉన్న షరోన్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల సందర్భంగా కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తెరాస నాయకులతో కలిసి క్రిస్టియన్లకు ప్రభుత్వం అందజేసిన దుస్తులను పంపిణీ చేశారు.