నాలుగు అడుగులు వేస్తూ నలుగురి ఆకలి తీర్చేద్దామా..!

  • “స్టెప్ ఫర్ ఏ కాజ్” పేరిట ఇంపాక్ట్ ఫిట్నెస్ యాప్ ఛారిటీ  
  • అడుగుల దానం తో అభాగ్యుల ఆకలి తీరుస్తున్న మొబైల్ యాప్

ప్రతిరోజూ వ్యాయామం లో భాగంగా వాకింగ్, వర్కౌట్ లు చేస్తే ఎం జరుగుతుంది..? శరీరంలో కొవ్వు కరిగి ఆరోగ్యంగా తయారవుతుంది అనేది అందరికీ తెలిసిన సంగతే. ఎంతోమంది ఆరోగ్యం పై శ్రద్ధ వహించే వారు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూనే ఉంటారు. మరి మనం వ్యాయామం చేస్తూ ఎలాంటి ఖర్చు చేయకుండా నలుగురు అభాగ్యుల ఆకలి తీర్చే అవకాశం దొరికితే అంతకంటే సంతోషకరమైన విషయం మరొకటి ఉండదు కదా. ప్రస్తుతం మనకు ఫిట్నెస్ మీద అవగాహన కలిగించే ఎన్నో యాప్ లు అందుబాటు లో ఉన్నప్పటికీ అవగాహన కల్పిస్తూ సామాజిక సేవ అందజేస్తుంది ఇంపాక్ట్ యాప్.

అనుష్క నటించిన జీరోసైజ్ సినిమాలో తన స్నేహితురాలి ఆసుపత్రి ఖర్చులకోసం  సైక్లింగ్ చేస్తూ వేలాది మందితో చేయిస్తూ ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేయడం మనం చూశాం. ఇంచుమించు అటువంటి కాన్సెప్ట్ తోనే ఇంపాక్ట్ యాప్ నడక, వ్యాయామం చేయిస్తూనే, విరాళాలు సేకరిస్తూ సామజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కొన్ని కార్పొరేట్ సంస్థలు సామజిక బాధ్యతలో భాగంగా విరాళాలు అందిస్తున్నట్లు యాప్ నిర్వాహకులు తెలుపుతున్నారు. ఇలా సేకరించిన విరాళాలతో అభాగ్యులైన చిన్నారులకు స్వచ్ఛమైన త్రాగునీరు, భోజనం, విద్య తదితర అవసరాలను తీర్చుతున్నారు.  ప్రతీ ఐదువేల అడుగులకు 10 రూపాయల చొప్పున మనం విరాళంగా అందించవచ్చు.  ఒంటరిగానే కాకుండా ఈ యాప్ లో ఉన్న బంధువులు, స్నేహితులతో కలిసి సమూహాలుగా ఏర్పడి, ఒకరిని ఒకరు ఉత్సాహపరచుకుంటూ మంత్లీ ఛాలెంజ్ లో పాల్గొనే అవకాశం కూడా ఉంది. ఛాలెంజ్ లో గెలిచినా వారు లీడర్ బోర్డు లో స్థానం దక్కించుకోవడం తో పాటు బ్యాడ్జిలను సొంతం చేసుకోవచ్చు.

నడిస్తే పోయేదేముంది.. పొట్టలో పేరుకున్న కొవ్వు తప్ప

యాప్ నిర్వాహకులు చెబుతున్నట్టు నిజంగానే అభాగ్యుల ఆకలి తీరుస్తారా లేదా అనే సందేహం చాలా మందికి కలగొచ్చు. ఈ విషయాన్ని మనం ధృవీకరించు కోలేకపోవచ్చు. ఐతే వారికి ధనరూపంలో ఎటువంటి సహాయం చేయడం లేదు కాబట్టి చింతించాల్సిన పనిలేదు. నడిస్తే పోయేదేముంది బాస్ పొట్టలో కొవ్వు తప్ప. ఒకవేళ నిజంగానే మన అడుగుల దానం వల్ల అభాగ్యుల ఆకలి తీరితే అంతకంటే గొప్పకార్యం ఇంకేముంటుంది. మరెన్నో రకాల ఫీచర్స్ ఉన్న ఈ యాప్ వ్యాయమ ప్రియులకు ఎంతగానో ఉపయోగ పడుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇంపాక్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని నడక మొదలు పెట్టేయండి.

యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి. https://play.google.com/store/apps/details?id=com.sharesmile.share

ఇలా అడుగులను డొనేట్ చేయండి…
యాప్ ను మొబైల్ లో డౌన్లోడ్ చేసుకుని ఏదైనా ఒక సోషల్ మీడియా అకౌంట్ తో లాగిన్ అవ్వాలి. అవసరమైన పర్మిషన్స్ మనం ఇచ్చిన తర్వాత మనం నడిచే అడుగులను యాప్ లెక్కిస్తుంది. ఇలా 500 అడుగులు పూర్తి చేసిన అనంతరం మన అడుగులను డొనేట్ చేయవచ్చు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here