శేరిలింగంపల్లి, అక్టోబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని అలీ తలాబ్ చెరువులో డ్రైనేజీ పైప్‌లైన్ లీకేజీ అవుతున్నట్లు సమాచారం అందడంతో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఆదేశాల మేరకు మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు సంబంధిత అధికారులతో కలిసి చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్, జలమండలి, GHMC ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో మాట్లాడి లీకేజీ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. కాలనీల్లో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు, తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణనలోకి తీసుకుని అత్యవసరంగా ఉన్న ప్రాంతాల్లో, తరచూ సమస్యలు ఎదురవుతున్న చోట ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేస్తామని నార్నె శ్రీనివాసరావు తెలిపారు.

డివిజన్లో ఏ చిన్న సమస్య తన దృష్టికి వచ్చినా పరిష్కారానికి కృషి చేస్తానని, కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ సమస్యలు లేని ఆదర్శవంతమైన కాలనీలుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు, మెరుగైన ప్రజా జీవనానికి అవసరమైన అన్ని మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో హైదర్‌నగర్ డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన డివిజన్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ నాక్ ఇంజనీర్ శశాంక్, జలమండలి మేనేజర్ విలియం ప్రకాష్, సూపర్వైజర్ నరేంద్ర, GHMC ఇంజనీరింగ్ ఏఈ సంతోష్, వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, కాలనీ వాసులు పాల్గొన్నారు.





