గాంధీ జయంతి సందర్భంగా దీప్తిశ్రీ నగర్‌లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం

శేరిలింగంప‌ల్లి, అక్టోబర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని దీప్తిశ్రీ నగర్ డివిజన్‌లోని నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శేరిలింగంపల్లి మాజీ కన్వీనర్ రాఘవేంద్ర రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేవాలయ పరిసరాలను శుభ్రం చేశారు. స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని కార్యక్రమ నిర్వాహకులు వివరించారు.

ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ మాజీ బీజేపీ అధ్యక్షుడు నారాయణ రెడ్డి, రాకేష్ దూబే, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, డబ్బా శ్రీను, రమణ కుమారి, నాగన్న, రాజశేఖర్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, శశిభూషణ్, శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ దీప్తిశ్రీ నగర్ బీజేపీ అధ్యక్షుడు అరవింద్ ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here