శేరిలింగంపల్లి, మే 16 (నమస్తే శేరిలింగంపల్లి): బీజేపీ సీనియన్ నాయకుడు, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి చింత కింది గోవర్ధన్ గౌడ్, హేమలత దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారికి బిజేవైఎం రాష్ట్ర నాయకుడు నీరటి చంద్రమోహన్ శుభాకాంక్షలు తెలిపారు. లింగంపల్లిలోని గోవర్ధన్ గౌడ్ నివాసంలో ఆయనను కలిసిన చంద్రమోహన్ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. వారు సంతోషంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.






