శేరిలింగంపల్లి, మే 16 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదానం – అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా శనివారం మధ్యాహ్నం భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ చేపట్టారు. అనంతరం సాయంత్రం యథావిధిగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రము, అన్నమయ్య అష్టోత్తరం, అన్నమ గాయత్రి (గురు స్తుతి)తో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమవగా అనంతరం అక్షద డాన్స్ అకాడమీ గురువు నిహాంత్రి రెడ్డి మార్గదర్శకత్వంలో శిష్యులు లతా నితిన్, లౌక్య, ఆశిక, సహస్ర రెడ్డి, కృతిక, చైత్రిక, ధన్య, నియతి, వైష్వి, నిహారిక, దుతి, హర్షిణి రాజ్, సాన్వి, శ్రీకృతి, ఇర్షిత, ప్రణీక, శ్లోక, మౌక్తిక, ఆరోహి, థాన్సి, నయన, జాహ్నవి, మానస్వి, మనోజ్ఞ, దేవి, సిరి, సిరి చందన, వర్షి, సంహిత, మేఘన, హర్షవి, ఆద్వి, నైనిక, జాహ్నవి.ఎన్, శ్రీకరి, ఇందుశ్రీ, సాన్వి.ఎస్ సంయుక్తంగా గణేశ వందనం, విఠల సంకీర్తనలు, ప్రదోష సమయము, దుర్గా స్తుతి అనే నృత్యాంశాలను భక్తి భావాభినయ సమన్వయంతో ప్రదర్శించి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా పద్మశ్రీ డా. శోభారాజు ఒక భక్తి సంకీర్తనకు భావార్థ వివరణ ఇచ్చి, గురువు నిహాంత్రి రెడ్డి తమ శిష్యులను భక్తి, నృత్య శాస్త్రం, భావాభినయాలతో తీర్చిదిద్దుతున్న విధానం ప్రశంసనీయం అని అభినందించారు. అనంతరం అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ వ్యవస్థాపకురాలు పద్మశ్రీ డా. శోభారాజు, సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ కళాకారులందరికీ శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారి జ్ఞాపికలను అందించి సత్కరించారు. కార్యక్రమం ముగింపులో భాగంగా శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళహారతి సమర్పించి, విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు.






