శేరిలింగంపల్లి, మే 16 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని జనప్రియ వెస్ట్ సిటీ కాలనీలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కాలనీవాసులతో కలిసి మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. జనప్రియ వెస్ట్ సిటీ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. రోడ్లు, డ్రైనేజి, మంచినీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, కాలనీలో పార్కు, కమ్యూనిటీ హాల్ సమస్యలను పరిశీలించడం జరిగిందని, త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనప్రియ వెస్ట్ సిటీ కాలనీ అధ్యక్షుడు సందీప్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు గోవర్ధన్, రామలింగం గౌడ్, ఏఎస్ఎన్ మూర్తి, మహేష్ కుమార్, శ్రీనివాస్ రావు, ప్రసాద్, హరికృష్ణ, వి ఆర్ శర్మ, శ్రీనివాస్, ఈశ్వర్ రెడ్డి, నరసింహులు, సుధాకర్, శంకర్ రావు, బ్రహ్మచారి, అనిల్ కుమార్, బాలాజీ సింగ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






