మెగా మెడికల్ క్యాంపుకు హాజ‌రు కావాల‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆహ్వానం

శేరిలింగంపల్లి, మే 16 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ఈ నెల 23వ తేదీన మియాపూర్ బీకే ఎంక్లేవ్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించనున్న మెగా మెడికల్ క్యాంపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజ‌రు కావాల‌ని కోరుతూ తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, ఇన్ఫర్మేషన్ & పబ్లిక్ రిలేషన్స్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, చైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సంద‌ర్భంగా ఉద‌య్ కిర‌ణ్ మాట్లాడుతూ సమాజంలోని ప్రతి వర్గ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ఈ మెగా మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్యాంపులో వివిధ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు పాల్గొని ఉచిత వైద్య పరీక్షలు, ఆరోగ్య సూచనలు, అవసరమైన మందులు, ఉచిత వైద్య సేవలను అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాంబశివరావు, శరత్, రాధాకృష్ణ, ప్రవీణ్, వంశీ, శివ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here