అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల మ‌ద్దతు తెరాస‌కే: ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

చందాన‌గ‌ర్‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు తెరాస‌కే ఉంద‌ని ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ అన్నారు. చందాన‌గ‌ర్ డివిజ‌న్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కట్ల చంద్ర శేఖర్ రెడ్డి, గుర్రం శ్రీకాంత్, కిషోర్, శ్రీకాంత్ రెడ్డి, నాగ మహేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్య‌కర్త‌లు గురువారం ప్ర‌భుత్వ విప్ లు ఆరెక‌పూడి గాంధీ, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, డివిజ‌న్ తెరాస అభ్య‌ర్థి మంజుల ర‌ఘునాథ్ రెడ్డిల స‌మ‌క్షంలో తెరాస‌లో చేరారు. వారంద‌రికీ తెరాస కండువాలు క‌ప్పిన ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో తెరాస‌దే విజ‌యం అన్నారు. మెజారిటీ డివిజ‌న్ల‌ను కైవ‌సం చేసుకుని గ్రేట‌ర్ కార్యాల‌యంపై తెరాస జెండాను ఎగుర వేస్తామ‌న్నారు.

పార్టీలో చేరిన వారితో ప్ర‌భుత్వ విప్ లు ఆరెక‌పూడి గాంధీ, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రఘుపతి రెడ్డి, రవీందర్ రావు, సునీత ప్రభాకర్ రెడ్డి, తెరాస నాయకులు మిరియాల రాఘవరావు, జేరిపాటి రాజు, దాసరి గోపి, ప్రవీణ్, రాంచందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సీతారామరాజు, మిరియాల ప్రీతమ్, మహమూద్, యూసఫ్ పాషా, గుడ్ల ధనలక్ష్మి, వరలక్ష్మి రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here