శేరిలింగంపల్లి, డిసెంబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు డ్రీం ఫర్ గుడ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచితంగా ప్రతి పని దినాల్లో ఉదయం పూట అల్పాహారం ( బ్రేక్ ఫాస్ట్ ) అందించే కార్యక్రమాన్ని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు.
ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ ట్లాడుతూ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు, చిన్న పిల్లలకు ఈ రకంగా అల్పాహారం పెట్టడానికి డ్రీం ఫర్ గుడ్ సొసైటీ వారు ముందుకు రావడం చాలా అభిందనీయమన్నారు. పిల్లలు ఉదయం పూట ఇంటిదగ్గర తినకుండా రావడంతో ఆకలితో స్కూలుకి వచ్చి ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు సరిగ్గా వినకుండా చాలా ఇబ్బంది పడుతుంటారని, అంతే కాకుండా సరైన పోషకాలు అందకుండా అర్ధాకలితో అలమటిస్తుంటారని, ఇటువంటి వారికి ఇది ఎంతో ఉపయోగ పడుతుందని అన్నారు.ఈ అవకాశాన్ని విద్యార్థులు చక్కగా ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , డ్రీం ఫర్ గుడ్ సొసైటీ వ్యవస్థాపకురాలు చావా అరుణ, సభ్యులు కళ్యాణి, పద్మావతి, విజయలక్ష్మి, AIG డాక్టర్స్ కళ్యాణ్, రోహిత్ తో పాటు కాలనీ వాసులు బ్రిక్ శ్రీను, గుమ్మడి శ్రీను, సాంబయ్య, పితాని శ్రీనివాస్, ప్రభాకర్, పూర్ణ, గొర్రెపాటి వివేక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.