శేరిలింగంపల్లి, డిసెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని బొల్లారం ప్రధాన రహదారి నుండి బికే ఎనక్లేవ్ , రెడ్డి కాలనీ , ప్రజా షెల్టర్ నుండి మక్త మహబూబ్ పెట్ విలేజ్ వరకు నూతనంగా నిర్మాణం చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక నాయకులు, జిహెచ్ఎంసి అధికారులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ బికే ఎనక్లేవ్ , రెడ్డి కాలనీ , ప్రజా షెల్టర్, మక్త మహబూబ్ పెట్ విలేజ్ ల అభివృద్ధికి కృషి చేస్తామని, కాలనీలలో మౌళిక వసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏఈ సంతోష్, వర్క్ ఇన్స్పెక్టర్లు నవీన్ , అన్వర్, కాలనీ వాసులు డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, కరీముల్లా, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.