శేరిలింగంపల్లి, డిసెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ ను అభివృద్ధి పథంలో ముందు ఉంచేందుకు అహర్నిశలు కృషి చేయడం జరుగుతుందని చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని సురక్ష ఎన్ క్లేవ్ లో 30 లక్షల రూపాయల వ్యయంతో నుతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. సిసి రోడ్డు నిర్మాణ పనుల్లో గుత్తేదారులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని లేనియేడల వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. చందానగర్ డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సుచించారు. డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో మౌలిక వసతులు కల్పనే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు రవి, చౌదరి, హుస్సేన్, చందానగర్ ఏఈ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.