శేరిలింగంపల్లి, డిసెంబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ యూత్ కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు నరేష్ నాయక్, కొండాపూర్ డివిజన్ యువజన ఉపాధ్యక్షుడు అక్షయ్ కుమార్ ఎన్నికైన సందర్భంగా మియాపూర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ ని డివిజన్ యువజన నాయకులతో మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ యూత్ కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు నరేష్ నాయక్, కొండాపూర్ డివిజన్ యువజన ఉపాధ్యక్షుడు అక్షయ్ కుమార్, మియాపూర్ డివిజన్ యువజన నాయకులకు వారి మిత్ర బృందానికి అభినందనలు తెలియచేస్తున్నాను అని , పార్టీ కి ప్రజలకు వారధిగా పనిచేస్తూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు చేరేలా చూడాలని ,భవిష్యత్తు లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కార్పొరేటర్ శ్రీకాంత్ తెలియచేసారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు స్వామి నాయక్ , సంతోష్ ముదిరాజ్, శివ ముదిరాజ్ , నాగరాజు యాదవ్, అవినాష్, ప్రవీణ్, పాండు , రైమతుల్లా (అడ్డు), చందు ముదిరాజ్, రాకేష్ నాయక్, వర్నన్ తదితరులు పాల్గొన్నారు.