శేరిలింగంపల్లి, డిసెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): AIFDS గ్రేటర్ హైదరాబాద్ కమిటి ఆధ్వర్యంలో కార్పొరేట్ కళాశాలల దోపిడీ విద్యార్థుల ఆత్మహత్యలు అనే అంశంపై తాండ రామచంద్రయ్య భవన్ మియాపూర్ లో రౌండ్ టేబుల్ సమావేశం యం.శ్రీకాంత్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐఫ్డిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురలి, ఎన్టీవీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కుమార్, aisf శేరిలింగంపల్లి మండల కార్యదర్శి ధర్మ తేజ, aidso రాష్ట్ర నాయకుడు నాగరాజు, పలు సంఘాల విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లె మురళి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 49 మంది ఇంటర్ విద్యార్థులు మృతి చెందినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం సిగ్గుచేటన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై వెంటనే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో Aisf ధర్మ తేజ తదితరులు పాల్గొన్నారు.