శేరిలింగంపల్లి, డిసెంబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): MCRHRD ఇన్స్టిట్యూట్ లో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలకు ,ఎమ్మెల్సీలకు లేజిస్లేచర్ ఒరియెంటెషన్ ప్రోగ్రాంను తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన సభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ డా నరసింహా చార్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 65 మంది ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు హాజరయ్యారు.