సోమ రాజన్నకు ఘన నివాళి

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 12 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ స్టాలిన్ నగర్ లో ఎంసీపీ ఐ (యూ )గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో సోమ రాజన్న, గోనె చేరాలు వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు తాండ్ర కళావతి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మైదం శెట్టి రమేష్ మాట్లాడుతూ సోమ రాజన్న ఎంసిపిఐ (యు ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా కేంద్ర కమిటీ సభ్యుడిగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంతో వర్గ స్ఫూర్తితో కష్టజీవుల పక్షాన సమరశిల‌లా పోరాటాల‌ను నిర్మించిన కష్టజీవుల కడలితరంగా పీడితపక్షాన రాజి లేని పోరాటాలను నిర్మించిన నేత అని కొనియాడారు. ఎం సిపిఐ (యు) నాయకుడు గోనే చేరాలుని పార్టీలో అంచలంచలుగా ఎదుగుతున్న యువ నాయకున్ని కక్షగట్టిన కాంగ్రెస్ గూండాలు హత్య చేశారు. గోనె చేరాలు జీవిత త్యాగం కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ (యు ) గ్రేటర్ హైదరాబాద్ సహయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యులు తాండ్ర కళావతి, ఇస్లావత్ దశరథ్ నాయక్, కమిటీ సభ్యులు పి భాగ్యమ్మ, ఎం రాణి, తుడుం పుష్పలత, స్థానిక సభ్యులు పాల్గొన్నారు.

సోమ రాజన్న, గోనె చేరాలు చిత్ర‌ప‌టాల‌కు పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పిస్తున్న నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here