శేరిలింగంపల్లి, డిసెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద 4 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జరుగుతున్న నాలా విస్తరణ పనులను, వరద నీటి కాల్వ నిర్మాణం పనులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు.
ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద నీటి కాలువ నిర్మాణం పనులు తుది దశలో ఉన్నాయని అన్నారు. పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో GHMC అధికారులు EE Gkd ప్రసాద్ , DE ఆనంద్, AE భాస్కర్, నాయకులు యాదగిరి గౌడ్, రవీందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.