శేరిలింగంపల్లి, డిసెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్నం భోజనం మెనూను పరిశీలించి, విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన ఆహారం అందించాలని సూచించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న మెను వివరాలు, ఉపాధ్యాయులను, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంటశాలలోని, బియ్యాన్ని, సరుకులను, నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు యాదగిరి గౌడ్, రవీందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.