శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 4వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో మియాపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ రాథోడ్ రవీందర్ సత్తా చాటారు. ఈ సందర్భంగా పెంకక్ సిలట్ (కటాస్)లో నిర్వహించిన పోటీల్లో ఆయన బంగారు పతకాన్ని సాధించారు. అలాగే టైక్వాండో, కరాటె, పెంకక్ సిలట్ (టైటిల్ ఈవెంట్)లలో ఆయన కాంస్య పతకాలను సాధించారు. ఈ సందర్భంగా పోలీస్ కానిస్టేబుల్ రాథోడ్ రవీందర్‌కు మియాపూర్ ఇన్స్పెక్టర్ అభినందనలు తెలిపారు. పోలీసులు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని, శారీరకంగా ఫిట్‌గా ఉండాలని సూచించారు.






