శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో డిప్యూటీ కమిషనర్ డి.శశిరేఖ, రెవెన్యూ సెక్షన్ ఏఎంసీ విజయ్ కుమార్, టీపీఎస్ రమేష్, డీఈ (ఎస్డబ్ల్యూఎం) వశీధర్, ఏఎంవోహెచ్ శ్రీకాంత్ రెడ్డి, ఎస్ఎస్ శ్రీనివాస్, ఇంజినీరింగ్ సెక్షన్ ప్రశాంత్, ఎంటమాలజీ సెక్షన్ బాలాగౌడ్, వెటర్నరీ సెక్షన్ గీత, యూబీడీ సెక్షన్ సతీష్, యూసీడీ సెక్షన్ వీణ, ఎలక్ట్రికల్ సెక్షన్ శివ శంకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందికి తమ సమస్యలపై వినతిపత్రాలను అందజేశారు. ఇంజినీరింగ్లో 4 ఫిర్యాదులు రాగా, యూబీడీలో 1, ఎలక్ట్రికల్ 1, టౌన్ ప్లానింగ్ 3, రెవెన్యూలో 1 ఫిర్యాదు వచ్చాయని అధికారులు తెలిపారు. ఆయా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు డీసీ శశిరేఖ ఆదేశాలు జారీ చేశారు.






