శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమం కొనసాగింది. జోనల్ కార్యాలయం తోపాటు నార్సింగి, అమీన్‌పూర్ , పటాన్‌చెరు, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లలో అధికారులు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. మొత్తం 19 వినతులు అధికారులకు అందాయి . ఇందులో జోనల్ కార్యాలయంలో 4, శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో 9, నార్సింగి సర్కిల్ కార్యాలయంలో 1 , మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో 3, అమీన్‌పూర్ సర్కిల్ లో 2 చొప్పున వినతులు వచ్చాయి. ఇందులో పట్టణ ప్రణాళిక, పన్ను విభాగం, ఇంజనీరింగ్ కు సంబంధించి సమస్యలను ప్రజలు వినతిపత్రం రూపంలో అందించారు. జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే ఆయా విభాగాల అధికారులతో కలిసి ప్రజావాణిలో వినతులను స్వీకరించారు.






