శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 23 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ లోని శిల్పారామంలో ఖాదీ మహోత్సవ 2026 సందర్బంగా సోమవారం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా నళిని గాజుల శిష్య బృందం లలిత సంగీతం, కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. శ్రీవల్లి లలిత సంగీతం ఆలపించారు. మూషిక వాహన, బ్రహ్మాంజలి, విన్యకకౌతం, జావళి, జయము జయము, జనుత శబ్దం, దశావతరాలు, జతిస్వరం, మహేశ్వరి, పదం అంశాలను కళాకారులు శ్రీనిధి, కీసర, కృతిక, శ్రేష్ఠ, నిహిర , జోషునిఁక, ధాత్రి, లాస్య, శాన్విక, హిమజ, శృతి, ప్రణమ్య, హరిణి , ఆద్య, అద్రితి, అక్షయ, హరిణి, షణ్ముఖ ప్రియా ప్రదర్శించి మెప్పించారు.






