శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 23 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మదీనాగూడ డివిజన్ హుడా కాలనీ – డాక్టర్ జి నగర్ (ఆర్టీసీ కాలనీ) కనెక్టింగ్ రోడ్డులో రహదారి పక్కన చెత్తను డంపింగ్ చేస్తున్నారని, దీని వల్ల రాకపోకలు సాగించే స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ జీహెచ్ఎంసీ అధికారులకు బీజేవైఎం రాష్ట్ర నాయకుడు నందనం విష్ణు దత్ ఫిర్యాదు చేశారు. ఆ రహదారిలో రాత్రి సమయాల్లో అసాంఘిక కార్యకలపాలు కూడా కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. దీంతో స్పందించిన అధికారులు వెంటనే రహదారిని సందర్శించి అక్కడ పేరుకుపోయిన చెత్తను తొలగించే పనులు చేపట్టారు. అలాగే రహదారికి ఇరువైపులా రోడ్డుకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే పని చేపట్టారు. అక్కడ చెత్త వేయకుండా బోర్డులను ఏర్పాటు చేస్తామని నందనం విష్ణుదత్‌కు తెలియజేశారు.






