నమస్తే శేరిలింగంపల్లి : వర్షకాలం కారణంగా ప్రమాదాలను నివారించేందుకు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ఇచ్చిన ఆదేశాల మేరకు విద్యుత్ స్తంభాలపై అక్రమ వైర్ల తొలగింపు ప్రక్రియను వెంటనే అమలు చేయాలని కోరుతూ విద్యుత్ ఏడీకీ టి పి సి సి కార్యదర్శి సామ్యూల్ కార్తీక్ ఫిర్యాదు చేశారు.
ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు. తాను గతంలో జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని కూడా విద్యుత్ ఏడీకీ తెలిపారు. కార్యక్రమంలో యువజన, విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.