నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ చందానగర్ డివిజన్ వేమన వీకర్ సెక్షన్ లోని బస్తిలో ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన వీకర్ సెక్షన్ బస్తీలో దీర్ఘకాలికంగా ఉన్న అభివృద్ధి పనులు, బస్తీలో ఉన్న ఇండ్ల పట్టాల, నీళ్లు, రోడ్ల సమస్యల పరిష్కారం కోసం శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దొంతి కార్తీక్ గౌడ్ నేతృత్వంలో చందానగర్ డివుజన్ యూత్ కాంగ్రెస్ నాయకులు పూసలపాటి వెంకటేశ్వర్లు, వేమన వీకర్ సెక్షన్ అసోసియేషన్ పెద్దల ఆధ్వర్యంలో డివిజన్ నాయకులు, కాలనీ సభ్యులతో కలిసి సభ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సునిత ప్రభాకర్ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దొంతి కార్తీక్ గౌడ్, డివిజన్ అద్యక్షులు అలీ, సీనియర్ మహిలా నాయకులు మైలారి పార్వతీ, శాంత, మైనారిటీ నాయకులు షఫీ, గౌస్, బాబా, అహ్మద్ ఖాన్, జహంగీర్, ఓ.బీ.సీ.సెల్. చందానగర్ డివిజన్ అద్యక్షులు హరి, వేమణ వీకర్ సెక్షన్ అసోసియేషన్ పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్ కుమార్, మౌలాలి, రమేష్, బస్తీ వాసులు ఉపేందర్, యుత్ కాంగ్రెస్ నాయకులు పూసలపాటి వెంకటేశ్వర్లు, యుత్ నాయకులు, బస్తీ వాసులు, బస్తీ మహిళలు పాల్గొన్నారు.






