- చందానగర్ డివిజన్ శంకర్ నగర్ లోని బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన కార్యకర్తలు
- కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని, మంచి వ్యక్తి సేవ గుణం కలిగిన నేత జగదీశ్వర్ గౌడ్ అన్నకు తోడుగా అడుగులో అడుగై ముందుకు నడుస్తామని కార్యకర్తలు తెలిపారు. చందానగర్ డివిజన్ పరిధి శంకర్ నగర్ బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నదని, ప్రజా పాలనకు నిదర్శనంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి పథకం రైతు భరోసా, గృహలక్ష్మి, యువ వికాసం, వృద్ధులకు, వికలాంగులకు చేయూత, 6 గ్యారంటీ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతాయని కాంగ్రెస్ పార్టీ అందరికీ న్యాయం చేసే పార్టీగా మీ అందరికీ తెలుసా అని కాంగ్రెస్ పార్టీతోనే అన్ని విధాలుగా ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దొంతి కార్తిక్ గౌడ్ నేతృత్వంలో చంద్రరావు ఆద్వర్యంలో గౌస్, పోచయ్య, శివభూషణ్, రాంమోహన్ రావు, శివ, పి. కోటెశ్వర్ రావు, శివ కురార్, సి.హెచ్. శ్రీనివాస్ రావు, పార్థసారథి, సి.హెచ్. బాలకృష్ణ యాదవ్, సి.హెచ్. శిరీషా, పూర్ణయ్య, ఖాదర్ మోహిన్ ఉద్దిన్, శ్రీనివాస్ గౌడ్, గోపాలకృష్ణ, శివకుమార్ తదితరులు పెద్దసంఖ్యలో బి.జే.పీ. పార్టీ నుండి జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో ఆదివారం శంకర్ నగర్ లోని చంద్రారావు నివాసం వద్ద కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సునితాఫ్రభాకర్ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దొంతి కార్తీక్ గౌడ్, డివిజన్ నాయకులు ఆలీ, మహిళా నాయకులు పార్వతి, శాంత, శంకర్ నగర్ కాలనీ స్ధానిక సీనియర్ నాయకులు సంజీవ రెడ్డి, రాములు, మానయ్య, కృష్ణ, కోటేష్వర్ రావు, స్ధానికులు, కాలనీవాసులు పాల్గొన్నారు.