స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దేశంలోని అతి పెద్ద బ్యాంకుల్లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఈ బ్యాంక్‌కు దేశ వ్యాప్తంగా అనేక ఏటీఎం సెంటర్లు ఉన్నాయి. అయితే ఎస్బీఐ తన సేవింగ్స్ కస్టమర్లకు 7 రకాల భిన్న డెబిట్ కార్డులను అందిస్తోంది. వాటి ద్వారా నిత్యం ఏటీఎంల నుంచి ఎంత మొత్తంలో నగదును గరిష్టంగా విత్‌డ్రా చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎస్బీఐ క్లాసిక్ అండ్ మాస్ట్రో డెబిట్ కార్డులు అయితే రోజుకు రూ.20వేల వరకు ఏటీఎం నుంచి విత్‌డ్రా చేయవచ్చు. అదే గ్లోబల్ ఇంటర్నేషనల్ కార్డు అయితే రూ.40వేలు, గోల్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ తో రూ.50వేలు, ఎస్బీఐ ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డుతో రూ. 1 లక్ష వరకు గరిష్టంగా నగదును విత్ డ్రా చేయవచ్చు.
ఎస్బీఐ ఇన్ టచ్ ట్యాప్ అండ్ గో డెబిట్ కార్డుతో రూ.40వేలు, ఎస్బీఐ ముంబై మెట్రో కాంబో కార్డ్‌తో రూ.40వేలు, ఎస్బీఐ మై కార్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డుతో రూ.40వేలను ఏటీఎం నుంచి రోజుకు గరిష్టంగా విత్‌డ్రా చేయవచ్చు.
ఎస్బీఐ జూలై 1వ తేదీ నుంచి డెబిట్ కార్డుల ట్రాన్సాక్షన్ లిమిట్లను మార్చింది. ఈ క్రమంలోనే ఎస్బీఐ ఏటీఎంల ద్వారా ఆ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ కస్టమర్లు నెలకు 8 సార్లు ఉచితంగా నగదును విత్‌డ్రా చేయవచ్చు. ఇక రూ.10వేలకు పైన నగదును ఎస్బీఐ ఏటీఎం నుంచి తీస్తే అందుకు ఓటీపీ అవసరం అవుతుంది. కస్టమర్‌కు చెందిన ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్‌కు రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి నగదును విత్ డ్రా చేయాల్సి ఉంటుంది.