మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం: కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్, సోఫా కాలనీ చెందిన వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిని గచ్చిబౌలి కార్పొరేటర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో ఎన్నాళ్లు గానో ఉన్న డ్రైనేజీకి అవుట్ లెట్ సమస్య చర్యలు తీసుకోవాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన సిసి రోడ్డు, యూజీడీ పైప్ లైన్ నిర్మాణం పనులను పూర్తి చేయాలని, మంచి నీటి వసతిని మెరుగుపరచాలని, విద్యుత్ సమస్యలను, వీధి దీపాలు సక్రమంగా పనిచేసేలా చూడాలని, పారిశుధ్యం పనులు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు కార్పొరేటర్ తక్షణమే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. కాలనీ వాసులకు ఇబ్బందులు లేకుండా డ్రైనేజీకి అవుట్ లెట్ ను ఏర్పాటుచేసి, అందుకు కావలసిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతిపాదనలు సిద్ధం కాగానే నిధులు మంజూరు చేయించి త్వరగా పూర్తి చేసి ప్రజల కష్టాలు తీరుస్తామని తెలిపారు.

కార్పొరేట‌ర్ గంగాధ‌ర్ రెడ్డిని క‌లిసిన ఎన్‌టీఆర్ న‌గ‌ర్‌, సోఫా కాల‌నీ వాసులు

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాజు నాయక్, శ్రీనివాస్, నరసింహ స్వామి, బాలకృష్ణ, వెంకటేశ్వర రెడ్డి, నారాయణ, కృష్ణ, లాల్ సింగ్, విజయ్, హీర్య, మోహన్ బాబు, వెంకటేష్ నాయక్, రాజు, సురేష్, గోపాల కృష్ణ, సత్యనారాయణ రాజు, కళ్యాణ్ నాయక్, రమేష్, హాసన్ భాయ్, ఎన్టీఆర్ నగర్, సోఫా కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here